: నేను ఆరోగ్యంగానే ఉన్నా... కంగారు పడద్దు!: దలైలామా
‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ బెంగపడద్దు’ అంటూ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. దలైలామా 3వ తేదీన ధర్మశాలకు రానున్నారు. త్వరలో తాను చేయబోయే పర్యటనలు, కార్యాచరణ వివరాల గురించి ఆయన అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. శాస్త్రవేత్తలతో దక్షిణ భారతదేశంలో నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. సుదీర్ఘ పర్యటనల తర్వాత చాలా సమయం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తనకు సూచించినట్లు ఆయన వివరించారు. ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ తీసుకోవాలని తన మిత్రుడు, జర్మనీలోని డాక్టర్ గతంలో తనకు చెప్పిన విషయాన్ని దలైలామా గుర్తుచేసుకున్నారు.