: టీట్వంటీలో ఆరుగురు బ్యాట్స్ మెన్ ఫాంలో ఉండాల్సిందే: ధోనీ
టీట్వంటీల్లో విజయం సాధించాలంటే ఆరుగురు బ్యాట్స్ మన్ ఫాంలో ఉండాల్సిందేనని టీమిండియా కెప్టెన్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆటగాళ్లలో దూకుడు ఉండాలని పేర్కొన్న ధోనీ, ఆ దూకుడు నిబంధనలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. టీమిండియా యువ ఆటగాళ్లు ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నారని తెలిపాడు. సౌతాఫ్రికాతో రేపు ఆడాల్సిన మ్యాచ్ కు సర్వసన్నద్ధంగా ఉన్నామని ధోనీ చెప్పాడు. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, శ్రీనాథ్ అరవింద్ ఉండగా, స్పిన్ బౌలింగ్ ను హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ చూసుకుంటారని ధోనీ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే తుది జట్టులో ఎవరు చోటు సంపాదించుకుంటారో రేపు సాయంత్రం తెలుస్తుందని ధోనీ తెలిపాడు.