: ఆదోని వ్యవసాయ మార్కెట్ లో రైతులను దోచేస్తున్నారు
ఆదోని వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులు తమను దోచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో నిన్న వేరుశనగను క్వింటాల్ 6,900 రూపాయలకు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ రోజు సగానికిపైగా ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. నేడు క్వింటాల్ కు 3,400 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక్క రోజులో క్వింటాల్ కు 3,500 రూపాయలు తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను వ్యాపారులు దోచుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఖర్చులు భరించలేక సగం ధరకు పంటను అమ్ముకుంటున్నారని తెలిపారు.