: అరుదైన రికార్డు... 3 రోజుల్లో 12 లక్షల మంది ఫాలోవర్లు
ట్విట్టర్ లో తన ఖాతా ఓపెన్ చేసిన మూడు రోజులకే 12 లక్షల మంది ఫాలోవర్లను మూటగట్టుకుని అరుదైన రికార్డు కొట్టేశాడు అమెరికా విజిల్ బ్లోయేర్ (ప్రజా వేగు) ఎడ్వర్డ్ స్నోడెన్. ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన మూడు రోజులకే లక్షల మంది ఫాలోవర్లు ఆయన ఖాతాలో పడ్డారు. ఈ అరుదైన రికార్డును సాధించిన స్నోడెన్ కు అధికారిక గుర్తింపు కూడా లభించింది. ట్విట్టర్ ఖాతా ప్రారంభించగానే ‘కెన్ యూ హియర్ మీ నౌ?’ అంటూ స్నోడెన్ ఫస్ట్ ట్వీట్ చేశాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన సందర్భంగా స్నోడెన్ మాట్లాడుతూ, చాలా ఆనందంగా ఉందని, తన ఫాలోవర్లకు కృతఙ్ఞతలని చెప్పాడు.