: విశాఖకు రైల్వే జోన్ వస్తుంది: హరిబాబు


విశాఖకు రైల్వే జోన్ వస్తుందన్న ఆశాభావం ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, త్వరలో అది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిణామల నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోందని ఆయన తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కనుక తమ పార్టీ రైల్వే జోన్ ఏర్పాటుపై గట్టిగా కృషి చేస్తుందని ఆయన వివరించారు. కాగా, రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే బోర్డు ఆశావహంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News