: నాటుపడవ బోల్తా: ముగ్గురు గల్లంతు
విశాఖపట్టణం జిల్లాలోని మత్స్యగెడ్డలో నాటు పడవ బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. ముంచంగి పుట్టు మండలం పట్నాపడాల్ పుట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒనకడిల్లీ వారపు సంతకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గల్లంతైన వారిలో పట్నాపడాల్ పుట్ కు చెందిన రవి, రాజేశ్వరి(8), మండీ దసాయి (10) ఉన్నారు. సంఘటనా స్థలం వద్దకు అధికారులు చేరుకుని తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబీకులు, బంధువులు రోదిస్తున్నారు.