: అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డట్టు పోలీసులు చెప్పారు. ఈ ముఠాపై నాలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగు వందలకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. కేవలం నిజామాబాద్ జిల్లాలోనే 40కి పైగా కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి మినీ లారీతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ ముఠాసభ్యుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News