: ఆ పాపం కేసీఆర్ దే: నాగం జనార్దన్ రెడ్డి
రుణమాఫీని పూర్తిగా ఒకేసారి చేస్తే రైతు ఆత్మహత్యలు ఆగుతాయని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేయడం వల్లే, వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల పాపం అంతా కేసీఆర్ దే అని అన్నారు. కనీసం కరవుపై నివేదికను కూడా ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 4న కిసాన్ బచావో దీక్షను చేపడతామని చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం సంతోషకర విషయమని అన్నారు. రైతు రుణమాఫీపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు, మంత్రులు ఇస్తున్న ప్రసంగాలకు పొంతన ఉండటం లేదని ఎద్దేవా చేశారు.