: ఆఫీసులో 6 గంటలు కూర్చుంటారా?... అయితే ఇలా చేయండి!


గంటల తరబడి అట్లానే కూర్చుని పని చేస్తే రక్త నాళాలు పనిచేసే తీరు క్రమేపి క్షీణించిపోతుంది. దానికి చెక్ పెట్టాలంటే... మధ్యలో పది నిమిషాలు నడిస్తే సరిపోతుందంటున్నారు పరిశోధకులు. ఏకధాటిగా ఆరు గంటల పాటు కూర్చుని పని చేసేవాళ్లు లేదా రోజు మొత్తంలో 8 గంటల పాటు పనిచేసేవాళ్ల కాళ్లలో రక్త ప్రవాహం చాలా తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో ప్రధానపాత్ర పోషించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జ్వామ్ పదిల్లా పేర్కొన్నారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో న్యూట్రిషన్, ఎక్సైర్సైజ్ ఫిజియోలజీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఎక్కువ గంటలపాటు కూర్చుని పనిచేసే వాళ్లు కనుక కేవలం 10 నిమిషాల పాటు నడిస్తే రక్తనాళాలు సమర్థంగా మరింత మెరుగ్గా పనిచేస్తాయి. అంతేకాదు అన్ని గంటలపాటు కూర్చోవడం కారణంగా ఏర్పడిన దుష్ఫలితాలు ఏమైనా ఉంటే, అవి కూడా సర్దుకుంటాయి. సుమారు 11 మంది ఆరోగ్యవంతులైన యువకులపై తమ అధ్యయనం చేశామని చెప్పారు. ఎక్కువ గంటల పాటు వారిని కూర్చోబెట్టి ఒకసారి, సాధారణ స్థితిలో మరోసారి పరీక్షలు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News