: ఏపీ భవన్ 'మిస్ ఫైర్' సంఘటనలో గాయపడింది ఓ ఇన్స్ పెక్టర్


ఢిల్లీలోని ఏపీ భవన్ లో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో తెలంగాణకు చెందిన ఓ ఇన్స్ పెక్టర్ గాయపడ్డారు. గోదావరి బ్లాక్ లోని 404 గదిలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఇన్స్ పెక్టర్ పేరు రవికిరణ్. ఘటన జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. గతంలో తిరుమలగిరి సీఐగా రవికిరణ్ పనిచేశారు. ప్రస్తుతం సీసీఎస్ లో విధులు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News