: రిషితేశ్వరి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో అరెస్టైన శ్రీనివాస్, జయ చరణ్, హనీషాలకు షరతులతో కూడిన బెయిల్ ను గుంటూరు ఒకటో అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చింది. ముగ్గురు విద్యార్థులు నెల రోజుల పాటు యూనివర్శిటీలో అడుగుపెట్టరాదని, 4 వారాల పాటు పెదకాకాని పోలీస్ స్టేషన్ కు ఉదయం 10 గంటల నుంచి 11 లోపు వచ్చి సంతకాలు చేయాలని షరతులు విధించింది. ఈ కేసులో అరెస్టైన వారికి 77 రోజుల తరువాత బెయిల్ లభించింది.