: పాలమూరు నిరుద్యోగికి శఠగోపం!
పాలమూరు జిల్లా వాసికి ఉద్యోగమిప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసగించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ కు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని వీరు చెప్పారు. దీంతో ఆ ముగ్గురికి రూ.40,000 ఇచ్చాడు చంద్రశేఖర్. ఎన్ని నెలలయినా తనకు ఉద్యోగం రాకపోవడంతో సచివాలయ ఎస్పీఎఫ్ సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ సిబ్బంది నిందితులు విజయ్, భాస్కర్, నరేందర్ లను అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది.