: మరో టైటిల్ వేటలో హింగిస్-సానియా


మార్టీనా హింగిస్-సానియా మీర్జా మరో టైటిల్ వేటలో ముందుకు సాగిపోతున్నారు. వూహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో సానియా-హింగిస్ జోడి సెమీ ఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్ లో అమెరికా జోడి రక్వెల్ కాప్స్ జోన్స్-అబిగెల్ పై 6-2, 6-2 తేడాతో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది. సానియా, హింగిస్ జోడీ జత కట్టిన తరువాత యూఎస్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలు సహా ఆరు టైటిల్స్ సాధించి సత్తాచాటారు. ఈ టోర్నీ కూడా సానియా, హింగిస్ జోడీ ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News