: వరల్డ్ క్లాస్ టీట్వంటీకి రెండు జట్లూ సిద్ధం


వరల్డ్ క్లాస్ టీట్వంటీకి టీమిండియా, సౌతాఫ్రికా జట్లు సిద్ధంగా ఉన్నాయి. వన్డే, టెస్టు, టీట్వంటీ పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న రెండు జట్ల మధ్య సుదీర్ఘమైన సిరీస్ జరగనుండడంతో అభిమానులకు పసందైన క్రికెట్ విందు లభించనుంది. రెండు జట్లు ఇప్పటికే తొలి మ్యాచ్ వేదిక ధర్మశాలకు చేరుకుని ముమ్మర ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. టీమిండియా టాపార్డర్ ను కట్టడి చేసేందుకు స్టెయిన్, మోర్కెల్, అబోట్, తాహిర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, వారిని ఎదుర్కొనేందుకు ధావన్, కోహ్లీ, ధోనీ, రహానే, రోహిత్, రైనా, రాయుడు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మిల్లర్, ఆమ్లా, డుప్లెసిస్, డికాక్, డివిలీర్స్, డుమిని లను ఎదుర్కొనేందుకు భువీ, మోహిత్, బిన్నీ, అశ్విన్, హర్భజన, అక్షర్ పటేల్, మిశ్రా సిద్ధంగా ఉన్నారు. రేపు సాయంత్రం జరగనున్న తొలి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే, వారికే సిరీస్ లో విజయావకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News