: మోదీ, చంద్రబాబు, కేసీఆర్ లు కొత్త పెళ్లి కొడుకుల్లా విహారయాత్రలు చేస్తున్నారు: నారాయణ


ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు విదేశీ పర్యటనలు చేయడంపై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. వారు ముగ్గురు కొత్త పెళ్లి కొడుకుల్లా విహారయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా పర్యటనలో ఉండగా మోదీ జాతీయ పతాకంపై సంతకం చేసి అవమానించారన్నారు. ఈ మేరకు హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. రిజర్వేషన్లు వద్దంటున్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ను ఎన్డీయే ఛైర్మన్ గా పెట్టాలని నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News