: సోనూసూద్ ను బతిమాలుతున్న బాలీవుడ్ బాద్షా
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ విలన్ వేషాలేసే సోనూసూద్ ను బతిమాలుతున్నాడు. షారూఖ్, సోనూ సూద్ ను బతిమాలడమేంటని అనుకుంటున్నారా?...సోనూ సూద్ హాలీవుడ్ సినిమాకు సంతకం చేశాడు. మార్షల్ ఆర్ట్స్ వీరుడు జాకీ చాన్ తో ప్రాధాన్యమున్న పాత్రలో సోనూ సూద్ నటిస్తున్నాడు. జాకీ చాన్ ను అభిమానించని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు. అలాగే షారూఖ్ ఖాన్ కూడా జాకీకి పెద్ద ఫ్యాన్. 'ప్రపంచంలో నాకు ఇద్దరు బాగా ఇష్టం. వారిలో జాకీ చాన్ ఒకడు. ముందా విషయం జాకీ చాన్ కి చెప్పు. ఆయనతో కలిసేలా చెయ్' అంటూ సోనూ సూద్ ను కోరాడు. దీనికి సోనూ సూద్ సమాధానమిస్తూ, 'లవ్ యూ టూ... నేను ఆల్రెడీ జాకీతో చెప్పాను... కొంచెం ఒపిక పట్టు, వచ్చేవరకు ఆగలేవా?' అంటూ ముద్దుగా కసురుకున్నాడు. వీరి ట్వీట్లు బాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.