: సబ్సిడియేతర గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడియేతర గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. సిలిండర్ కు రూ.42 తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. మరోవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో విమాన ఇంధనం ధర 5.5 శాతం పెరిగింది. ఈ క్రమంలో విమాన ఇంధన ధరలు పలు ప్రాంతాల్లో స్థానిక పన్నులు, అదనపు పన్నులను బట్టి మారనున్నాయి. మరోవైపు సబ్సిడీయేతర కిరోసిన్ ధర రూ.54 పైసలు పెరగడంతో లీటర్ కిరోసిన్ ధర రూ.43.18కి చేరింది.