: రైతు ఆత్మహత్యలపై వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వండి: రఘువీరా


ఏపీలో ఒక్క సెప్టెంబర్ లోనే 70 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వామినాథన్, జేపీ ఘోష్, రామచెన్నారెడ్డి నివేదిక అమలును నిలిపివేయడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని రఘువీరా మీడియా సమావేశంలో విమర్శించారు. ఆత్మహత్యలపై హైకోర్టుకు వాస్తవాలతో కూడిన నివేదిక సమర్పించాలని, ఈ కేసులో తమ పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతుందని తెలిపారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తులపై లోకేష్ చేసిన ప్రకటన అవాస్తవమన్నారు. వాస్తవ ఆస్తులు ప్రకటించామని, తమకు బినామీలు లేరని చంద్రబాబు కాణిపాకం వద్ద ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులు రూ.40 లక్షలే అంటున్న బాబు వాటిని కోటి రూపాయలకు అమ్ముతారా? అని సవాల్ విసిరారు. కాగా, రాజమండ్రిలో రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ ధర్నా నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో గాంధీ విగ్రహాల వద్ద కూడా సత్యాగ్రహ ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News