: 'మేడిన్ చైనా'తో పెను ప్రమాదం: హార్వార్డ్ వర్శిటీ


చైనాలో తయారై ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ జరుగుతున్న చౌక ప్రొడక్టులతో పర్యావరణానికి పెను విఘాతం కలుగుతోందని మేరీల్యాండ్ యూనివర్శిటీతో కలసి చైనా ఉత్పత్తులపై అధ్యయనం చేసిన హార్వార్డ్ వర్శిటీ వెల్లడించింది. చూడటానికి ప్రీమియం బ్రాండ్ ఉత్పత్తులలానే కనిపించే ఇవి అధిక కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని, దీని ద్వారా పర్యావరణం మరింత వేగంగా నాశనమవుతోందని అధ్యయన కర్త, కాలిఫోర్నియాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టీవెన్ జే డేవిస్ వ్యాఖ్యానించారు. గత 15 సంవత్సరాలుగా, చైనాలో ఉత్పత్తి రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అగ్రరాజ్యాలకు సైతం చైనా వస్తు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అయితే, వీటిల్లో నాణ్యత ఎంతమాత్రమూ ఉండటం లేదని, పైగా తయారీకి వాడుతున్న ముడి పదార్థాలతో పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోందని ఆయన హెచ్చరించారు. పలు చిన్న దేశాల్లో తయారవుతున్న ఉత్పత్తులతో పోలిస్తే చైనా ప్రొడక్టులు అధిక కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని తెలిపారు. 'మేడిన్ చైనా' ఉత్పత్తులను కొనుగోలు చేయడం తగ్గించాలని సూచించారు.

  • Loading...

More Telugu News