: ఈ నెల 4న టీడీపీ కొత్త కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం


తెలుగుదేశం పార్టీ కొత్తగా ప్రకటించిన కేంద్ర, ఆంద్రప్రదేశ్, తెలంగాణ కమిటీ సభ్యులు ఈ నెల 4న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారం సమయంలో ప్రతి సభ్యుడు కమిటీలో తన పాత్ర, చేయవలసిన పనుల గురించి వివరిస్తారని టీడీపీ మీడియా ఎఫైర్స్ కమిటీ కోఆర్డినేటర్ ఎల్వీఎస్ఆర్ కే ప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News