: 35 అడుగుల కరెంటు పోల్ ఎక్కిన పర్వత సింహం... మీరూ చూడండి!


అది కేవలం పర్వత సాణువుల్లో మాత్రమే కనిపించే సింహం. దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. పర్వతాలు ఎక్కి దిగే అనుభవం బాగా ఉందేమో! నిట్టనిలువుగా 35 అడుగుల ఎత్తున్న కరెంటు స్తంభాన్ని ఎక్కింది. దీన్ని ఓ న్యూస్ పేపర్ ఏజన్సీ స్టాఫర్ చూని తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఆ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ సింహం, రహదారిపై వస్తున్న స్కూలు పిల్లల బస్సును చూసి భయపడి ఆ స్తంభం ఎక్కినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా మారూమూల ప్రాంతం లుకర్నీ లోయలో జరిగింది. స్తంభం ఎక్కిన సింహం చాలా సేపటి వరకూ కిందకు దిగలేదు. ఆ వైనం మీరూ చూడండి!

  • Loading...

More Telugu News