: వాళ్ల దగ్గర రూ. 3,770 కోట్ల బ్లాక్ మనీ ఉందట!


నల్లధనం వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 90 రోజుల గడువు నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో, 638 మంది తమ దగ్గరున్న నల్లధనం వివరాలను కేంద్రానికి సమర్పించారు. తమ వద్ద మొత్తం రూ. 3,770 కోట్ల నల్లధనం ఉందని వారు వెల్లడించారు. ఈ వివరాలను కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు వివరాలను వెల్లడించిన వారు పన్నులు, బకాయిలు చెల్లించడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఉందని చెప్పింది. బయటకు వెల్లడించని విదేశీ ఆస్తులను కలిగిన వారెవరైనా, వాటి వివరాలను వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం 'వన్ టైమ్ కంప్లయన్స్' సదుపాయాన్ని కల్పించింది. గడువులోగా వివరాలను వెల్లడించిన వారు... ఆస్తిలో 60 శాతం పన్ను, జరిమానా రూపంలో కడితే సరిపోతుంది.

  • Loading...

More Telugu News