: ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారు: ఎంపీ గుత్తా
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పండుగల పేరట పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమాలతో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీనే ఉద్యమాలను అణచాలనుకోవడం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యలకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఖరే కారణమని గుత్తా ధ్వజమెత్తారు.