: దసరా నవరాత్రుల తరహాలో రాజధాని శంకుస్థాపన వేడుకలు: మంత్రి ప్రత్తిపాటి
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దసరా నవరాత్రుల తరహాలో రాజధాని శంకుస్థాపన వేడుకలు నిర్వహిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. లక్షమంది విచ్చేసే ఈ కార్యక్రమాన్ని భారీ వేడుకగా ఈ నెల 13 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నిర్వహించిన 'రైతుకోసం చంద్రన్న యాత్ర' విజయవంతమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా రాలేదని, రుణమాఫీలో ఎలాంటి సమస్యలున్నా ఇప్పటికీ పరిష్కరిస్తామని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను తమ దృష్టికి తీసుకురావాలని బ్యాంకులకు సూచిస్తున్నామన్నారు.