: కపిల్ దేవ్ ను కలసిన అల్లు అర్జున్


కపిల్ దేవ్... అప్పటి దాకా స్పిన్ బౌలింగ్ పైనే ఆధారపడ్డ టీమిండియా జట్టును తన ఫాస్ట్ బౌలింగ్ తో ఉరకలు పెట్టించిన లెజెండరీ క్రికెటర్. డెడ్ పిచ్ లపై సైతం తనదైన శైలితో పేస్ ను, స్వింగ్ ను రాబట్టిన యోధుడు. ఇక బ్యాట్ చేతబడితే, బంతి బౌండరీలు దాటాల్సిందే. లాంగ్ లెగ్ దిశగా కపిల్ కొట్టిన సిక్సర్ లు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. కపిల్ సారథ్యంలోనే టీమిండియా తన తొలి వరల్డ్ కప్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ కపిల్ ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిశాడు. ఈ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డిని కూడా తీసుకెళ్లాడు. అనంతరం తన సంతోషాన్ని అభిమానులతో ఫేస్ బుక్ లో పంచుకున్నాడు. "మన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ ను కలిశాం. ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. చాలా సింపుల్ గా ఉన్నారు. సెట్ మ్యాక్స్ లో హిందీలోకి డబ్ అయిన సౌత్ ఇండియా సినిమాలను చూస్తానని కపిల్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. రేసు గుర్రంలో నా నటన గురించి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకెంతో గర్వంగా ఉంది" అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు, కపిల్ తో కలసి దిగిన ఫొటోను కూడా ఫేస్ బుక్ పేజ్ లో ఉంచాడు.

  • Loading...

More Telugu News