: బాబు వచ్చారు, ఇక 'జాబ్'లూ వస్తాయి: లోకేష్
రాయలసీమ ప్రాంతంలోని యువతకు ఉద్యోగావకాశాలు దగ్గరయ్యే సమయం వచ్చిందని తెదేపా యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పది వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. విజయవాడలోని ఓ కళాశాలలో ర్యాంగింగుకు వ్యతిరేకంగా జరిగిన అవగాహనా సదస్సుకు హాజరైన ఆయన ప్రసంగించారు. బాబు వచ్చారు, ఇక 'జాబ్'లు కూడా వస్తాయని వ్యాఖ్యానించిన ఆయన ర్యాగింగ్ ఇండియాలోని సంస్కృతి మాత్రమేనని, విదేశాల్లో ఎక్కడా లేదని అన్నారు. ర్యాగింగును విడనాడాలని కోరారు. తెలుగుదేశం అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.