: అమరావతి రైతులకు పట్టువస్త్రాలు, అందరి పేర్లతో పైలాన్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగరం నిర్మాణానికి భూములిచ్చిన ప్రతి రైతునూ సముచిత రీతిన సత్కరిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. నగర శంకుస్థాపన రోజున రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపుతామని రాష్ట్ర మంత్రి రావెల వెల్లడించారు. దసరా నాడు అందరికీ పట్టువస్త్రాలు ఇచ్చి సత్కరిస్తామని తెలిపారు. భూమిని ఇచ్చిన ప్రతి రైతు పేరును శిలాఫలకాలపై చెక్కించి భారీ పైలాన్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలియజేశారు. భూమిని త్యాగం చేసిన రైతులను తరతరాలు గుర్తుంచుకునేట్టు చేయాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు.