: డబ్బు నువ్వు తే, ఖర్చు నేను పెడతా: తలసానితో పోచారం


తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వీరిద్దరూ తారసపడిన వేళ వాణిజ్య శాఖా మంత్రిగా తలసాని డబ్బులు వసూలు చేసి తనకివ్వాలని పోచారం వ్యాఖ్యానించారు. తలసాని డబ్బు తెచ్చిస్తే, తాను వ్యవసాయం, రైతుల కోసం ఖర్చు చేసి ప్రజలకు అవసరమైన ఆహారం, బట్టలను సమకూర్చుతానని ఆయన అన్నారు. ఆ తరువాత తిరిగి పన్నుల రూపంలో మీ శాఖకే డబ్బు జమచేస్తామని, తిరిగి దాన్ని మళ్లీ తమకే ఇవ్వాల్సి వుంటుందని పోచారం అన్నారు. "రాష్ట్ర ప్రజల పొట్ట నాదే, బట్ట నాదే" అన్న ఆయన త్వరగా డబ్బులిచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా అన్నారు. దీనికి "సరే అన్నా" అంటూ తలసాని బదులిచ్చారు.

  • Loading...

More Telugu News