: చంద్రబాబు ఇంట్లో మరో వేడుక ...15న నారావారిపల్లెకు నారా, నందమూరి ఫ్యామిలీస్!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిలో కొంతకాలం క్రితం మరో వ్యక్తి వచ్చి చేరాడు. కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రహ్మణిలకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఆ చిన్నారి ఎంట్రీతో అప్పటిదాకా చంద్రబాబు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య ఐదుకు చేరింది. నామకరణం రోజున ఆ చిన్నారికి ‘దేవాంశ్’గా పేరు పెట్టారు కూడా. తాజాగా దేవాంశ్ కు పుట్టు వెంట్రుకలు తీయించే సమయం ఆసన్నమైంది. ఈ నెల 15న చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇటు చంద్రబాబు కుటుంబంతో పాటు, అటు దేవాంశ్ తాతయ్య నందమూరి బాలకృష్ణ తరఫున నందమూరి ఫ్యామిలీస్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.