: దేశవ్యాప్తంగా నిలిచిన లారీలు... ఏపీలో మూతపడ్డ పెట్రోల్ బంకులు


టోల్ ప్లాజాలు, స్పీడ్ గవర్నర్ల ఎత్తివేతలే ప్రధాన డిమాండ్లుగా లారీ యజమానులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల పరిధిలోనే 14 లక్షల మేర లారీలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో దేశ ఎగుమతులు, దిగుమతులపై పెను ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాక విశాఖ పోర్టులో సరుకు రవాణాపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉంటే, వ్యాట్ ను తగ్గించాలన్న డిమాండ్ తో ఏపీలోని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు చేపట్టిన ఆందోళన కూడా అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పెట్రోల్ కోసం నిన్న రాత్రి అన్ని ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి.

  • Loading...

More Telugu News