: ఏపీ ఎక్స్ ప్రెస్ బోర్డు మారింది... నేటి నుంచి ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’ గా మార్పు


సికింద్రాబాదు-న్యూఢిల్లీల మధ్య రాకపోకలు సాగిస్తున్న ‘ఏపీ ఎక్స్ ప్రెస్’ ఇకపై కనిపించదు. ఎందుకంటే, ఈ రైలు ఇకపై ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’గా మారిపోనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాదు-న్యూఢిల్లీల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు పేరును ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’ గా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపానికి రైల్వే శాఖ సమ్మతించింది. ఇప్పటికే ఈ రైలు పేరును మారుస్తూ ఆ శాఖ నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఆ ఆదేశాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వస్తాయి. అంటే, నేటి నుంచి రైల్వే శాఖకు చెందిన అన్ని విషయాల్లో ఇకపై ఈ రైలును తెలంగాణ ఎక్స్ ప్రెస్ అనే పేర్కొనాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News