: సూర్యనారాయణుడి పాదాలను తాకిన సూర్య కిరణాలు... పరవశించిన భక్తులు


అరసవెల్లి సూర్యనారాయణుడి ఆలయంలో మరోమారు అద్భుతం సాక్షాత్కరించింది. ఆలయంలోని మూల విరాట్ పాదాలను సూర్యుడి కిరణాలు తాకాయి. ఈ అరుదైన అద్భుతాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఏటా అక్టోబరు తొలి వారంలో సాక్షాత్కరించే ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఏకంగా అక్టోబర్ మాసం తొలి రోజుననే సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. ఇదిలా ఉంటే, మరో రెండు రోజులు (రేపు, ఎల్లుండి) కూడా సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి రానున్నారు.

  • Loading...

More Telugu News