: తన కల నెరవేరిందంటున్న సంపూ!
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన కల నెరవేరిందని తెలిపాడు. ఇంతకూ సంపూర్ణేష్ బాబు కల ఏమిటంటే ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవిని కలవడం! 'బ్రూస్ లీ' సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్న చిరంజీవి షూటింగ్ కోసం లొకేషన్ కు వెళ్లారు. దీంతో షూటింగ్ స్పాట్ లో ఉన్న సంపూర్ణేష్ బాబు ఆయనను కలిశాడు. చిరంజీవి 'గ్యాంగ్ లీడర్' సినిమాలోలా ఉన్నారని సంపూ ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే చిరంజీవిని చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని సంపూ ట్విట్టర్లో తెలిపాడు. 'హృదయ కాలేయం' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంపూర్ణేష్, 'కొబ్బరిమట్ట' సినిమాలో నటిస్తున్నాడు.