: 364 విత్తన కంపెనీలతో త్వరలో సమావేశం: మంత్రి పోచారం


రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకుగాను వచ్చే నెల 5వ తేదీన 364 విత్తనాల కంపెనీలతో, యూనివర్శిటీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క కంపెనీకి అప్పగిస్తామని అన్నారు. రైతులకు అవసరమయ్యే విత్తనాలను ఆయా మండలాలలోనే తయారు చేయిస్తామని, ఎక్కడైతే ధాన్యం పండుతుందో అవే మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని మంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News