: ఏపీకి రైల్వేజోన్ రాదన్న వార్తల్లో వాస్తవం లేదు: రైల్వే బోర్డు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేజోన్ హుళక్కేనని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ ఊహాజనితమని రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటుపై అధ్యయన నివేదిక ఇప్పటికే రైల్వే బోర్డుకు అందిందని వారు చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుపై సంప్రదింపులు జరుగుతున్నాయని, పూర్తి స్థాయిలో ఇంకా ఏదీ నిర్ధారణ కాలేదని వారు వెల్లడించారు. నివేదికపై నిర్దిష్ట అభిప్రాయాన్ని రైల్వే బోర్డు వెల్లడించాల్సి ఉందని వారు వివరించారు. దీంతో రైల్వే జోన్ పై మళ్లీ సందిగ్ధం నెలకొంది.

  • Loading...

More Telugu News