: రెండేళ్ల పిల్లాడిపై దొంగతనం కేసు
సరిగ్గా మాటలు కూడా రాని రెండేళ్ల పిల్లాడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సర్దార్ పూర్ ప్రాంతంలో ఈ నెల 20న దొంగతనం జరిగింది. దీంతో ఆ గ్రామస్థులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నలుగురిలో ఒక రెండేళ్ల బాలుడు కూడా ఉండడం విశేషం. దీంతో బాలుడు సహా అతని తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరూ నేడు న్యాయస్థానం ముందు హాజరుకాగా, సరిగ్గా మాట్లాడటం కూడా రాని చంటిపిల్లాడు దొంగతనం ఎలా చేస్తాడంటూ అతని తండ్రి న్యాయస్థానం ముందు వాపోయాడు. దీంతో వాదోపవాదాల అనంతరం బాలుడిపై న్యాయస్థానం కేసు కొట్టివేసింది.