: ఐఎస్ఐఎస్ పై దాడికి రష్యా రెడీ


ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ పై పోరుకు రష్యా సిద్ధమవుతోంది. దేవుడి రాజ్యం స్థాపిస్తామంటూ సిరియాలో మానవ హననానికి పాల్పడుతున్న ఐఎస్ పై దాడులు చేయాలని రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. రష్యా బలగాలు సిరియా వెళ్లి, అక్కడ ఇస్లామిక్ తీవ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేయనుంది. అయితే సిరియా సేనలకు సాయంగా రష్యా కేవలం వైమానిక దాడులను మాత్రమే చేస్తుందని రష్యా స్పష్టం చేసింది. కాగా, ఐఎస్ఐఎస్ పై ఫ్రాన్స్ ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, 50 కోట్ల మందిని అంతం చేసేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర పన్నినట్టు సీనియర్ జర్నలిస్టు, జర్మన్ మాజీ ఎంపీ జూర్జెన్ టోడెన్ హోఫర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News