: బకాయిలు చెల్లించాలంటూ రాళ్లు రువ్విన రైతులు
బకాయిలు చెల్లించలేదంటూ రైతులు రాళ్లు రువ్విన సంఘటన విశాఖపట్నం జల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభలో చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ చైర్మన్ మల్లునాయుడు సభలో ప్రసంగిస్తుండగా బకాయిలు చెల్లించాలంటూ రైతులు నిలదీశారు. సభలో ఉన్న కుర్చీలను కింద పడవేసి తమ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు సభను జరగనివ్వకుండా వేదికపైకి రాళ్లు, కుర్చీలు విసిరివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా, వేదిక వద్ద ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి.