: క్రీడాకారిణి శైలజకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం...స్పందించిన అచ్చెన్నాయుడు


అంతర్జాతీయ, జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ మాజీ క్రీడాకారిణి పూజారి శైలజకు గతంలో ఇచ్చిన హామీలన్నింటికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి ఎన్నో పతకాలు సాధించిన పూజారి శైలజ దైన్య స్థితిపై ప్రసారమైన కథనాలపై స్పందించిన అచ్చెన్నాయుడు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆమెకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని అన్నారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆయన చెప్పారు. అలాగే కరణం మల్లీశ్వరికి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు స్థలం కూడా కేటాయిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News