: అంబేద్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన కేంద్రం
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ స్మారక పోస్టల్ స్టాంపులను ఢిల్లీలో ఆవిష్కరించారు. అంబేద్కర్ గౌరవార్థం త్వరలో ఓ నాణెం కూడా ముద్రించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి మూడు రోజుల కిందటే సంబంధిత అనుమతి లభించిందని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లట్ తెలిపారు.