: కాస్త తినొచ్చాక మాట్లాడుకుందాం... కేసీఆర్, జానాల ఆసక్తికర సంభాషణ!


తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభలో ప్రతిపక్షనేత జానారెడ్డిల మధ్య సంభాషణ ఆసక్తి కరంగానే కాదు, కొంత ఆప్యాయతతోనూ సాగింది. కేసీఆర్ ప్రసంగం పూర్తయిన తర్వాత జానారెడ్డి మాట్లాడుతూ ‘రైతు ఆత్మహత్యల విషయమై నేను కొన్ని సలహాలు, సూచనలు చేయాలనుకుంటున్నాను. దీనికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. సభ్యులకు అభ్యంతరం లేకుంటే ఇప్పుడు సగం, భోజన విరామం తర్వాత మిగిలిన సగం మాట్లాడతాను. లేదంటే, భోజనం విరామం తర్వాతే పూర్తిగా మాట్లాడతాను. అంతా మీ ఇష్టం’ అని జానా అన్నారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ ..‘భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం, బాగా చర్చించుకుంటాం. భోజనం తర్వాతే మీ సలహాలివ్వండి’ అన్నారు. దీనికి జానా ప్రతిస్పందిస్తూ ‘భోజనం చేశాక, మీరు వస్తారా?’ అని ప్రశ్నించగా, ‘తప్పకుండా వస్తాను.. భోజనం చేసి వద్దాం, నో ప్రాబ్లమ్’ అని కేసీఆర్ తన శైలిలో సమాధానం చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత భోజన విరామం కోసం సభను స్పీకర్ వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News