: అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి: వీహెచ్ పీ నేతలు


అయోధ్యలో రామమందిర నిర్మాణంపై వీహెచ్ పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి గళమెత్తారు. రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని సింఘాల్, స్వామి గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాతైనా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News