: ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మరిన్ని ప్రాజెక్టులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ వచ్చాయన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో బెల్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అన్నివిధాలుగా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. బెల్ ఏర్పాటుకు పాలసముద్రం అనువైన ప్రదేశమన్నారు.

  • Loading...

More Telugu News