: విచారణకు సహకరించని సోమ్ నాథ్ భారతి
గృహ హింస కేసులో అరెస్టైన ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతిని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సోమ్ నాథ్ పై ఆయన భార్య లిపిక హత్యాయత్నం, గృహ హింస కేసులను పెట్టిన సంగతి విదితమే. దీంతో, ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి సోమ్ నాథ్ అదృశ్యమయ్యారు. దీనిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు ఎక్కడున్నా లొంగిపోవాలని సోమ్ నాథ్ ను ఆదేశించింది. మరోవైపు, పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరగడం చాలా తప్పని ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులకు సోమ్ నాథ్ భారతి లొంగిపోయారు. అయితే, విచారణకు సోమ్ నాథ్ సహకరించడం లేదని పోలీసులు తెలిపారు.