: ఎల్లుండి మ్యాచ్ కోసం ధర్మశాల చేరుకున్న ఆటగాళ్లు
శిఖర్ ధావన్ తో బాటు, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ ఇరు జట్ల ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. నాలుగు రోజుల ముందే భారత్ జట్టు మొత్తం ధర్మశాల చేరుకోగా, భారత్ ఏ జట్టు కెప్టెన్ గా బంగ్లాదేశ్ తో మూడు రోజుల మ్యాచ్ ఆడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆలస్యంగా జట్టుతో కలిశాడు. ధర్మశాల వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఎల్లుండి టీట్వంటీ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాంగ్రా విమానాశ్రయంలో దిగిన సందర్భంగా సఫారీ ఆటగాళ్లు సెల్పీలతో సందడి చేశారు.