: నమ్మకాన్ని కాపాడుకుంటా: ఏపీ టీడీపీ అధ్యక్షుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భవన్ లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా పని చేస్తానని చెప్పారు. ఏపీలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని కళా వెంకట్రావు తెలిపారు. అంతకు ముందు ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు.

  • Loading...

More Telugu News