: విండీస్ కు షాక్...సత్తా చాటిన బంగ్లా
క్రికెట్ ప్రపంచం మినీ వరల్డ్ కప్ గా భావించే 2017 చాంపియన్స్ ట్రోఫీకి విండీస్ దూరం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 జట్లు పోటీపడతాయి. అయితే ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. దీంతో వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, అఫ్ఘన్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం లేదు. గేల్, పొలార్డ్, బ్రావో, సామీ, హోల్డర్ వంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లున్న విండీస్ జట్టు పాయింట్ల ప్రకారం టోర్నీ అర్హత సాధించలేకపోవడంతో తొలిసారి విండీస్ జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. కాగా, బంగ్లాదేశ్ అత్యుత్తమ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచి, తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.