: ముస్లిం విద్యార్థుల డ్రాప్ అవుట్సే ఎక్కువ!


తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన ఇతర కులాల విద్యార్థులతో పోల్చి చూడగా ముస్లిం విద్యార్థుల స్కూల్ డ్రాప్ ఔట్స్ (మధ్యలో చదువు మానేసే వారు) సంఖ్య ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థ వెల్లడించింది. 2013-14 విద్యా సంవత్సరంలో మాధ్యమిక విద్య విషయంలో మొత్తం విద్యార్థుల డ్రాప్ ఔట్స్ శాతం 17.43 కాగా, ముస్లిం విద్యార్థుల డ్రాప్ ఔట్స్ శాతం 30.95 గా ఉంది. ఎస్సీల్లో 16 శాతంగా, ఎస్టీల్లో 15.58 శాతం కాగా ఓబీసీల్లో 18.69 శాతంగా నమోదైంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఉన్నత విద్యలో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, పాఠశాలలతో పాటు గుర్తింపు పొందని పాఠశాలల్లో కూడా సర్వే నిర్వహించారు. ముస్లిం విద్యార్థుల డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉండటానికి, వారి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News