: బిందెలో తలను ఇరికించుకున్న చిరుత పాట్లు ... మీరూ చూడండి


అడవిలో ఉండాల్సిన చిరుత గ్రామంలోకి వచ్చింది. ఎందుకంటే, నీళ్లు తాగేందుకు. ఆ గ్రామంలో ఒక ఇంటి ఆరుబయట ఉన్న బిందెలో నీళ్ల కోసం తలదూర్చింది. అంతే... కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు తాగకపోగా, తల బయటకు రాక పిచ్చిపట్టినట్లు పరిగెత్తింది. ఈ సంఘటన రాజస్థాన్ లోని సమంద్ జిల్లాలో జరిగింది. చిరుతపులి గాండ్రింపులు వినబడుతుండటంతో ఆ ఇంట్లో వారితో పాటు, స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. బిందెలో తల ఇరుక్కుపోయిన చిరుతను చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పోనీ, ఎవరైనా ధైర్యం చేసి ఆ బిందెను తొలగిస్తారేమో అనుకుంటే, అంత సాహసం ఎవరూ చేయలేక, చివరకు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News