: ఇలా అయితే...తెలుగు మర్చిపోతామేమో!
ఆంగ్లభాష మోజులో ప్రాంతీయ భాషలు మరుగున పడిపోతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ మోజు మరికొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. గత రెండేళ్లలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2004-05తో పోల్చితే ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం చదివే విద్యార్థుల సంఖ్య 40 శాతం వృద్ధి చెందగా, తెలుగు మాధ్యమం విద్యార్థుల సంఖ్య 154 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. 2013-14 గణాంకాల ప్రకారం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొత్తం 1,10, 89, 215 మంది విద్యార్థులు వివిధ స్కూళ్లలో చదివితే, వారిలో తెలుగు మాధ్యమంలో 58, 46, 272 మంది విద్యార్థులు వుండగా, ఆంగ్ల మాధ్యమంలో 48, 83, 189 మంది విద్యార్థులు వున్నారు. ఇంగ్లీషు మోజులో స్వరాష్ట్రంలోనే తెలుగుకు తీరని అవమానం జరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.